పల్లవి
మహాకనకదుర్గా, విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా - 2
శివంకరీ శుభంకరీ సూర్యచంద్ర కళాధరీ
బ్రహ్మవిష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలకరీ
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తీ ||మహా||
చరణం 1
ఓంకార రావాల అ ల ల కృష్ణాతీరంలో ఇంద్రకీల గిరిపైన వెల్సెను కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను,
పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను
విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగ కనకదుర్గ కైనది స్ధిరనివాసము
మేలిమి బంగారు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమా
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడకా
ప్రేమా కరుణా వాత్సల్యం కురిపించే దుర్దరూపం
ముక్కోటి దేవతలందరికి ఇది ఇల్లే పుట్టిదీపం ||మహా||
చరణం 2
దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణకవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే సుమంత్రరూపీ గాయత్రీ
లక్షల సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణీ మహాలక్ష్మీ
విద్యా కవన గాన మొసగు వేదమునీ సరస్వతీ,
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ
శతృ వినాసిని సత్యస్వరూపిని మహిషాసురమర్ధినీ,
విజయకారిణి అభయ రూపిణి శ్రీ రాజరాజేశ్వరీ,
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం ||మహా||