పల్లవి
రామా ... రామా ...
అందరి బంధువయా భద్రాచల రామయ్యా
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా - 2
చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా - 2
కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండరామయ్యా ||అంద|| ||రామా||
చరణం 1
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యము నేలే రామయ్యా
తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయ్యా
మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్యా
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోసించెనయ్యా
అసురునిత్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ్యా
సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా
నారాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ... ఆ ... 2
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా
కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా ||అంద||
చరణం 2
భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు బద్రుని కొండగ మార్చి కొలువై ఉన్న స్ధలం
పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్ధమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా - 2
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరీ అయ్యా
ఈ క్షేత్రం తీర్ధం దర్శించిన జన్మ ధన్యమయ్యా ... ||అంద||