పల్లవి
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
చరణం 1
చెలగీ వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము
చరణం 2
పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరుమని చూపిన పరమ పదము నీపాదము . . .
విభాగములు: $ గుర్తు పాట మొదలయ్యే అక్షరాలను సూచిస్తుంది, * గుర్తు పాట పాడిన గాయని, గాయకుల పేర్లను సూచిస్తుంది, + గుర్తు సినిమా పేరుని సూచిస్తుంది, - గుర్తు కధానాయకుడు, కధానాయకురాలి పేర్లను సూచిస్తుంది, # గుర్తు ఎటువంటి పాటో సూచిస్తుంది. ఉదాహరణకు, భక్తి గీతాలు, సోలో పాటలు, యుగళ గీతాలు, దేశభక్తి గీతాలు, పిల్లల పాటలు.