ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...
ఏల గాలి మేడలూ... రాలు పూల దండలు
నీదో లోకం... నాదో లోకం
నింగీ నేల తాకేదెలాగ!
ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా... ||2||
ఏల గాలి మాటలూ... మాసిపోవు ఆశలూ
నింగీ నేల తాకే వేళ
నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే... రేవు లేదులే
వీడుకోలిదే... వీడుకోలిదే
చరణం 1
నిప్పులోన కాలదూ నీటిలోన నానదూ
గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ
రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నమూ
పేదవాడి కంటిలో ప్రేమ రక్తమూ
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు జరిగేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకూ
రాజశాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమా
ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా... ||2||
చరణం 2
కాళిదాసు గీతికీ కృష్ణ రాసలీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమపల్లవి
ఆ అనారు ఆశకీ తాజ్మహల్ శోభకీ
పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ
నిధి కన్న ఎద మిన్న గెలిపించు ప్రేమనే
కధ కాదు బ్రతుకంటే బలికాని ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమా
ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా... ||2||
కాలమన్న ప్రేయసీ తీర్చమందిలే కసీ
నింగీ నేల తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం ప్రేమదే జయం