పల్లవి
[అతడు]ప్రేమ అనే పరీక్షరాసి వేచివున్నా విధ్యార్ధిని ||2|| ||ప్రేమ||
నీ మనసు పలకపైన నాసంఖ్య చూసినపుడు
నేనే నన్ను నమ్మలేదు నాకనుల నమ్మలేదు
[ఆమె] నన్ను నమ్ము నన్ను నమ్ము
ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం
డోలీ డోలీ డోలీ డోలీ ||4||
చరణం 1
[అతడు] ఆ... ఈ చేతికి గాజులు నేనేకదా
నేడు గాజులు తొడిగే రోజేకదా
[ఆమె] గాజులు తొడిగితే సుఖముందిలే
ఆ సుఖమే మళ్లిమళ్లి మది కోరిందిలే
[అతడు] ఇవి చెక్కళ్లా పూల పరవళ్లా
[ఆమె] ఈ చెక్కిలిపై నీ ఆనవాలా
[అతడు] అహ నిన్నటిదాకా నేనొక హల్లుని
నువ్వొచ్చాక అక్షరమైతిని ||ప్రేమ||
చరణం 2
[ఆమె] నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం
ఆ సుఖమున కందిన ముఖం ముఖం
[అతడు] మనసెందుకు చేసెను తపంతపం
ఆనందమే ఇక నేనేమై పోయినా
[ఆమె] అలుపెరుగదులే ఏ ప్రేమలోనా
[అతడు] అల లాగవులే నీలిసంద్రాన
[ఆమె] ఇది జన్మజన్మలకు వీడని బంధం
విరహానికైన దొరకని బంధం ||ప్రేమ||