మనసుపడి మనసుపడి మన్మధుడే మనసుపడి

పల్లవి

మనసుపడి మనసుపడి మన్మధుడే మనసుపడి ||2||
నీకోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే ||2||
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీకోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే ||2||
నా గుండెలే ఆటస్ధలముగా ఏ గిరిగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి పెళ్లికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులుపెట్టి మణికట్టుకు గాజులు తొడిగి
ఈరోజా చేతికి రోజాపువ్వు అందించు ||గోరింట||
నీ వరుడు రేపు వేంచేస్తాడు తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్లి వేదికను నే వెయ్య ఆవరుడు చేయి నీకందియ్య
నీతండ్రి మది ఉయ్యాలలూగ

చరణం 1

ఆ... మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనాపెదవి మొదలలేదు ||మనసు||
ఆదుకున్న దైవం - ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతో
నా కనులనిండుగా నీరూపం నిను తలచుకొనడమే నాధ్యేయం ||2||
నీ ఆనందమే నాసంతోషం నాప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం ||మనసు||

చరణం 2

కలువ కళ్లకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోనా మొగలిపూలు పేర్చి ||కలువ||
విలువ కట్టలేని మణులు ఎన్నోదాల్చి
హంసలాగ వేదిక కొచ్చే చంద్రబింబ వదనం
మేళతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టెలే పెళ్లికొడుకు ||మేళ||
ఈ పేదహృదయమే దీవించే పూలజల్లే కురియు వర్ధిలు కలకాలం ||మనసు||