దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ

పల్లవి

[అతడు]దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్‌ పడుచులు ఆడప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించినా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేయనా ఈనాడు ||చెలి||
తనజాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా ||తన|| ||దాండియా||

చరణం 1

[అతడు] నిన్ను చూసి నన్ను నేను మరచి
చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగివున్న ఆమాట తెలిసిందా
[ఆమె] నిన్ను చూసి నాలో నేను మురిసి
అసలుమాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
[అతడు] ఓ... కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసి నేను కున నల్లుకుంటా
[ఆమె] ఓ... కళ్లలో నాకాటుక కరిగిపోవునంట
కురులలోనా పువ్వులన్ని వాడిపోవునంట
[అతడు] నీ ప్రేమ హృదయమే పొందేనా
తాళిబొట్టు నీకు నే కట్టేనా
[ఆమె] ఈమాట మాత్రమే నిజమైతే
నాజన్మే ధన్యం
[అతడు] నాప్రేమ [ఆమె] నీవేలే ||2|| ||దాండియా||

చరణం 2

[ఆమె] ప్రేమని చూపులో వుంది మహత్మ్యం
ప్రేమభాషలో వుంది కవిత్వం
ప్రేమించుటలో వున్నది దైవత్వం దైవత్వం
[అతడు] ప్రేమసృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈలోకం భూలోకం
[ఆమె] ఓ... నామనసు నీలో దాచి ఉంచినాను
ఆ మనసు క్షేమమేనా తెలుసుకొనగ వచ్చాను
[అతడు] ఓ... నీ మనసు పదిలంగా దాచి వుంచినాను
నాకంటే నీమనసే నాపంచప్రాణాలు
[ఆమె] హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
[అతడు] ఈమాట మాత్రమే నిజమైతే నాజన్మే ధన్యం
[ఆమె] నాప్రేమ [అతడు] నీవేలే ||2||
యువతీ యువకుల కలయికకోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియా అను ఒక రాతిరి ||యువతీ||
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించైండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి ||2||