పల్లవి
చుక్కలాంటి అమ్మాయి
చక్కనైన అబ్బాయి
ఇద్ద రొద్దికైనారు
ముద్దు ముద్దుగున్నారు
||చుక్క||
చరణం 1
ఈ పిల్లకు మనసైంది
ఆ కళ్ళకు తెలిసింది
ఆ పిల్లాడు వలచింది
ఈ బుగ్గకు సిగ్గైంది
కళ్యాణం వైభోగం
నేడో రేపో ఖాయం అన్నారు
మేళాలు తాళాలు బాణాసంచా కలలే కన్నారు
||చుక్క||
చరణం 2
పెళ్ళికి మాకేమిస్తారు?
కొత్త బట్టలు కుట్టిస్తారు
గుర్రం సార్టు ఎక్కిస్తారు
ఊరంతా ఊరేగిస్తారు
||చుక్క||