రంగులలో కలవో

పల్లవి

రంగులలో కలవో
ఎద పొంగులలో కళవో
నవ శిల్పానివో
రతి రూపానివో
తొలి వూహల వూయలవో...

చరణం 1

కాశ్మీర నందన సుందరిలో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో
మరుని బాణమో మధుమాస గానమో
నవపరిమళాల పారిజాత సుమమో

చరణం 2

రంగులలో కలనై
ఎద పొంగులలో కళనై
నవ శిల్పాంగినై
రతి రూపాంగినై
నిను వూహల వూగించనా

చరణం 3

ముంతాజు అందాల అద్దానివో
కషాబాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో
ప్రణయ దీపమో నా విరహతాపమో
నా చిత్రకళా చిత్ర చైత్రరధమో! ||రంగు||