పల్లవి
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటుచూస్తే అటు నీవే మరుగైనా కావే
చరణం 1
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
గాయాన్నైనా మాననీవు
హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణి కానీదు
||ఎదుట||
చరణం 2
కలలకు భయపడిపోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకంత బలముందా
||ఎదుట||