అదే నీవు అదే నేను

పల్లవి

అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా
కనులలో చూడనా

చరణం 1

కొండా కోన గుండెల్లో
ఎండా వానలైనాము
గువ్వాగువ్వ కౌగిల్లో
గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదిలేని గానము ||అదే||

చరణం 2

నిన్నా రేపు సందెల్లో
నేడై వుందా మన్నావు
కన్నీరైన ప్రేమలో
పన్నీరౌదా మన్నావు
అదే బాసగా అదే ఆశగా
ఎన్నినాళ్లీ నిన్న పాటే పాడను ||అదే||