పల్లవి
కొత్త పెళ్ళికూతురా రా రా నీ కుడికాలు ముందు మోపి రా రా
గణపతి కులసతి రా రా నువు కోరుకున్న కోవెలకు రా రా ||కొత్త||
చరణం 1
కలిమికి కాణాచి నీ పుట్టినిల్లు చెలిమికి మాగాణి నువు మెట్టినిల్లు ||2||
ధనమున్నది బలమున్నది నీ ఇంటా ||2||
మనసున్నది మమతున్నది మా ఇంట ||కొత్త||
చరణం 2
పై మొరుగులు పైడి నగలు లేవు ఇక్కడ
పంతాలు సాధింపులు రావు ఇక్కడ ||2||
నిండు మనసు చిరునగవు పండునిక్కడ ||2||
ఆ పండు వెన్నెలందు దినం పండుగిక్కడ ||కొత్త||
చరణం 3
కన్నతల్లి కన్నమిన్న మీ అత్తగారు కనిపించే దైవము చేకొన్న వాడు ||2||
కలలన్నీ నిజమౌ నీ కాపురానా ||2||
కలకాలం వెలుగు నీ ఇంటి దీపము ||కొత్త||
కొత్త పెళ్ళికూతురా
విభాగములు:
- ఎ.యన్.ఆర్,
- రాజ శ్రీ,
* జమునారాణి,
* స్వర్ణలత,
# యుగళ గీతాలు,
+ సిరి సంపదలు 2,
$ క - ఘ