పల్లవి
గగనసీమలదిరే మాయింట విజయపతాకెగిరే
ఉత్సాహాలే ఉప్పొంగంగా, ||మె||
ఉల్లాసంగా చేయంగా సంబరంగా ఒక పండగజరిపి ఆ అంబరమందుకుంటాం ||గగ||
చరణం 1
[ఆమె] కడుపులో నెలలుగా పెరిగిన సంతానం, కనులలో
అలలుగా కరిగితే ఎం లాభం
[అతడు] నిదురలో జారిన దీపికలు యిలా ఎదురైతే చాలుకదా
[ఆమె] పొలంలో నిన్నటి నారులిలా క్షణంలో పైరుగా మారందా
[అతడు] యిదే సంక్రాంతిగా యదే చిందేయగా, చూడే మనవాడే
యింతింతై అపుడే ఎంతై పోయాడే ||గగ||
చరణం 2
[అతడు] పిలిస్తే గులామై పలకదురా ఏ గమ్యం వలేస్తే చులాగ్గా
పడదురా ఏ లక్ష్యం శ్రమించే అలసట ఆనందం అదిచ్చే బహుమతి అపురూపం
[అతడు] అలల్లో ఎగిసిన ఆవేశం తలాంచి ఒదగదు ఏనిమిషం
[ఆమె] శిరులు కొనలేనిదీ సుళువుగా రానిదీ, ఇదిగో ఆ విజయం
మన ఇంట్లో నవ్వుల నాట్యం చేసింది ||గగ||