ఇంత దూరమొచ్చినాక సిగ్గెందుకూ

పల్లవి

ఇంత దూరమొచ్చినాక సిగ్గెందుకూ ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ . . .
అంతదాక వచ్చాక అడ్డెందుకూ . . . లోతులోన మునిగాక ఒడ్డెందుకూ . . .
కరుసు పెట్టనప్పుడు సొమ్మెందుకూ సరస మాడనప్పుడు సొగసెందుకూ . . .
గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుంజం
అడు గుడు అడు గుడు గుడు గుడు లంచం ||గుడు||
చెడుగుడు చెడుగుడు గుడు ఛంఛం . . .

చరణం 1

కంటిలోన నలుసు తీయమన్నావు
నలుసు తీసి చంప నలపమన్నావు చెంపగిల్లి ఆగలేవు అన్నావు
పెదవి పండు ముద్దు పిండుకున్నావు
పెదవి నుండి మెడలోకి చేరుకున్నాకా
మెడలోని గొలుసుతోటి ఆడుకున్నాకా
గుండెలో జారుకుని గుట్టునే గుంజుకుని
అంతలో పుంజుకుని అదునుచూసి అదుపుదాటితే ||గుడు||
జరుగుడు జరుగుడు గుడు కొంచెం ||గుడు||
విరుగుడు విరుగుడు గుడు మంచం

చరణం 2

కాలిలోని ముల్లు తియ్యమన్నావు
ముల్లుతీసి మువ్వ ముట్టమన్నావు
మువ్వముట్టి ముందుకెళ్లి పోయావు చీర అంచుపట్టి పైకి పాకావు
చీరలోని మూరలోని చిక్కుకున్నాక
దారి తెన్ను ఏదినాకు చిక్కకున్నాక
చెంగులే దులుపుకుని నిన్ను చేపట్టుకుని
చీరలా చుట్టుకుని చివరి వరకు కధలు నడిపితే . . . ||గుడు||
పెరుగుడు పెరుగుడు గుడు పైత్యం ||గుడు||
తరికిట తరికిట కిట కిట తధ్యం . . . ||ఇంత||