పల్లవి
[ఆమె] కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా
బుసకొడుతుంటే నేను తాళగలనా
[అతడు] చాలులే నీ నటన సాగదే ఇటుపైన ఎంతగా నస
పెడుతున్నా లొంగిపోనె లలనా
[ఆమె] దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైనా
[అతడు] మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ...
ఓ... ఓ... ఓ...
[ఆమె] కస్సుమని కారంగా కసిరినది చాలింక ఉరుము
వెనుక చినుకు తడిక కరగవా కనికారంగా
[అతడు] కుదురుగా కడదాకా కలిసి అడుగెయ్యవుగా కనులు
వెనకే కరిగిపోయే కలవి గనుకా
[ఆమె] నను గొడుగై కాచే నువ్వు పిడుగులు కురిపిస్తావా
[అతడు] నువ్వు గొడుగును ఎగరేస్తావే జడివానా హో...
ఓ... ఓ... ఓ... ||కోపమా||
చరణం 1
[ఆమె] తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమేగా మనసులోని
చెలియబొమ్మ చెరిపినా చెరగదు గనుక
[అతడు] సులువుగా నీలాగా మరిచిపోలేదింకా మనసు విలువ
నాకు బాగా తెలుసు గనుకా
[ఆమె] ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా
[అతడు] వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో...
ఓ... ఓ... ఓ... ||కోపమా||