పల్లవి
[అతడు] జన్మ జన్మల వరమీ కలయిక
పైటకొంగుని వదలను నేనిక
పాల బుగ్గల అల్లరి పిల్లతో
శోభనం భలే వేడుక
[ఆమె] ముందురున్నది ముద్దుల పండగ
తరముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తారా ఇక
నాయకా ఒడే వేదిక
[అతడు] Oh my darling మొనాలిసా ఎక్కిందె ఏదో నిషా
[ఆమె] మెచ్చేసానోయి మనోహరా
నచ్చింది నీ తొందరా ||జన్మ జన్మల||
చరణం 1
[అతడు] మొదటి చూపుతో మురిపించి
మెల్లమెల్లగా తెరదించి
మాయమవ్వకే ననుకవ్వించీ
[ఆమె] మెత్త మెత్తగా ముద్దిచ్చి
మత్తుమత్తుగా ననుగిచ్చి
మంట రేపకోయి మైమరపించి
[అతడు] హఠాత్తుగా వరాలవాన
వర్షించెనా ఎడారిలోన
శృతిమించినా సుఖాల వీణ ఓ ప్రియతమా
[ఆమె] నన్నడగాలా నరోత్తమా
నాసొగసు నీదే సుమా
[అతడు] మెచ్చేశానే మయూరమా
మోహాల తేలించుమా ||జన్మ జన్మల||
చరణం 2
ఎంత వింతదీ గిలిగింత
అణువు అణువునా పులకింత
తనివి తీర్చనా ఎంతోకొంత
[అతడు] తేనె పెదవిలో తొణికింత
తీగ నడుములో ఒణికింత
తడిమి చూడనా నీతనువంతా
[ఆమె] అదేకదా వివాహబంధం
అనుక్షణం అదో సుగంధం
అందచానా ప్రియా యుగంతం ప్రేమామృతం
[అతడు] Oh my darling మోనాలీసా
అయ్యానే నీబానిస
[ఆమె] మాటలతోనే మహాశయా
గడిపేస్తే ఎట్టాగయ్యా ||జన్మ జన్మల||
[అతడు] జన్మ జన్మల వరమీ కలయిక
[ఆమె] ముందురున్నది ముద్దుల పండగ
Oh my darling మోనాలిసా
[ఆమె] మెచ్చేసానోయ్ మహాశయా
నువ్వేగ నా బాద్షా