నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్ట్

పల్లవి

నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్ట్
మారిపోవునా సురిరాం సురిరాం సురిరాం సురిరాం
ఆరుబైట కూడినా పడకటింట కూడినా
ఆరునొకటి ఏడుకాక పోవునా
ప్యారు చేసినా లవ్వు చేసినా ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా
ప్రేమల్లో పిచ్చి మారునా కుర్రవయసుల్లో కచ్చతీరునా . . . 2

చరణం 1

ఎడమకన్ను కొట్టినా . . . సురిరాం సురిరాం . . . కుడికన్ను
కొట్టినా . . . సురిరాం సురిరాం . . . కళ్లలోని కోరికే మారునా . . .
విస్తరేసి పెట్టినా పళ్లెమేసి పెట్టినా వంటలోని ఘాటు మారిపోవునా . . .
వూరే మారినా పూవు మారునా . . . వస్త్రం మారిన . . . వరస మారునా . . .
సెల్లుమారు ఇల్లుమారు పిల్లదాని ఒళ్లుమారు గజ్జెల్లో ఘల్లుమారునా...
నా......జంటప్రేమల్లో జిల్లు మారునా . . .
గజ్జెల్లో ఘల్లు మారునా....జంటప్రేమల్లో జిల్లు మారునా . . .
పాపపా . . . పాపపా . . . పాపపా . . . పాపపా . . .

చరణం 2

తేనెతోటి తుడిచినా నేతితోటి తుడిచినా కోకపిల్ల ఆకలే . . . తీరునా
కీచులాటలాడినా కిస్సులాటలాడినా రాతిరేళ యాతనే తీరునా. . .
అందం యిచ్చినా ఆశతీరునా భాగం పంచినా బాధతీరునా
లక్కుతీరు కిక్కుతీరు పెక్కుమార్లు తిక్కతీరు
ఆటల్లో అలుపుతీరినా గోటిగాయాల్లో నలుపుతీరునా