గుండెల్లో గులాబీల ముళ్ళు

పల్లవి

[అతడు] గుండెల్లో గులాబీల ముళ్ళు . . .
నాటిందో నిగురాల వళ్ళు
నన్ను మాయ జేయకే నెరజానా . . .
[ఆమె] అయ్యయ్యో ఇలారాకు వెళ్ళు . . .
ఒంపుల్లో ఇరుక్కుంటె కళ్లు . . .
నిన్ను లాగలేనుగా నేనైనా . . .
[అతడు] తపో భంగమయ్యేలా . . .
అలా కొంగు జారాలా . . .
[ఆమె] మరీ బెంగ పెరిగేలా. . .
ఇలా తొంగిచూడాలా . . .
[అతడు] అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి . . .
మతి చెదిరిన ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ ||గుండెల్లో||

చరణం 1

[అతడు] అగ్గిలాంటి నీ అందాలు . . .
రగిలించగానే ఈ చన్నీళ్లు . . .
ఆవిరావిరై పోతాయో సౌందర్యమా . . .
[ఆమె] సిగ్గుదాటి నీ ఆత్రాలు సొగసల్లుతుంటె సుకుమారాలు
అల్లరల్లరైపోతాయో శృంగారమా . . .
[అతడు] నిందించి తప్పించు కోకమ్మా . . .
కనువిందించ్చి కవ్వించు కోకమ్మా
[ఆమె] నువ్వంత తెగించి రాకమ్మా . . .పోమ్మా . . . ||గుండెల్లో||

చరణం 2

[ఆమె] కాగాడాలు అనిపించేలా . . .
నీ ఆగాడాలు వెలిగించాలా . . .
ఎక్కడెక్కడేవున్నయో. . .గాలించగా . . .
[అతడు] సోగతాలు వినిపించేలా
నీ సోయాగాలు శృతిమించాలా
పెక్కడెక్కడేవున్నాయో వివరించగా
[ఆమె] చురుక్కు చురుక్కు మనేలా . . .
నను కొరుక్కు కోరుక్కు తినాలా . . .
[అతడు] వయస్సు సమస్య తీరేలా . . . రామ్మా . . . ||గుండెల్లో||