పల్లవి
జేజే జేజేజే - 4
హే రామయ్య పాదాలెట్టే సీతమ్మ పారాణేట్టే
ఈ కొండకోనసీమల్లో- అహా పులకించె గుండెలోతుల్లో
కోయోడు ఘంటం పట్టె బోయాడు గురిచూపెట్టె
సింహాలు పొంచేదారుల్లో- నరసింహలు గెలిచే పోరుల్లో
పులి-పులి - 4, అదిగో పులితోక - - -
గిలి - గిలి - 2, మెఖాలగిలిగిలి ఇదినా పొలికేక - 2 ||జే||
చరణం 1
నడిసిరిస పసరిస నసపెట్టు, అసలుకధ మొదలెట్టు
వయసు గుస కసికసి నసపెట్టు, సిసలుకధ సిగపట్టు - 2
దినుసు మిస కసకస తీరెట్టు, ఇరుసులకు జోరెట్టు
అరుసు అడుగుల విసిరేట్టు, నుడుసులకు అడుసెట్టు
[అతడు] పెళాపెళా పెళ పంజా విసిరె బొబ్బిలిలో శౌర్యం
ఛలా ఛలా ఛల చెంగున ఎగిరే జింకలలో వేగం
చిమా చిమా చిమ చీమల బారులు చెప్పేనొక పాఠం
మెరా మెరా మెర మెరుపుల్లో నెమలాటే ఒక నాట్యం
మన్నైన ఇస్తుంది మాణిక్యాలెన్నో, మానైన చేస్తుంది త్యాగాలెన్నెన్నో
అడవుల్లో వున్నాయి అందాలెన్నెన్నో, అడగకనే చెబుతాయి అర్థాలింకెన్నో
జిలి జిలి జిలి బలి జిగేలు జిలు బలి - అదిగో నెమలీక
చలి చలి చలి చలి కొరుక్కు తిను చలి - ఇదిగో నిప్పుకాకు - 2
చరణం 2
గణాగణ గణరాజు రాకకే గగనాలదరాలీ,
మహా మహా మృగరాజు అడుగులో పిడుగులురావాలి
గగనం భువనం అదిరి చెదిరినా ఎదురురై నిలవాలి
గురిలో బరిలో, గిరిలో, చెరిలో మనిషై గెలవాలి
మృగమేదో దాగుంది మానవరూపంలో, వెంటాడి వేటాడు మమతల చాపంతో
వేటాడే వడుస్తున్న వేగుల చూపుల్లో, కాపాడే గుణముంది కన్నుల రెప్పల్లో
చెడుగుడు - 2 కలబడు నిలబడు చెదుతోజతగాక
తలబడి తడబడి తెరబడి నెరవడి గురిచెడి గుంపును విడిపోక ||జై||