బాలీవుడ్ బాలరాజుని

పల్లవి

[అతడు] బాలీవుడ్ బాలరాజుని పాటల్లో త్యాగరాజుని
బంగ్లాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగువాడిన అందరిలో చిన్నవాడిని గుండెల్లో గూడుకట్టుకోనా
చిరునవ్వు తూ జీతే రహొ ఈజన్మకి
జీనాయహ గానా యహ ఏనాటికీ ||బాలీ||

చరణం 1

సంగీతమౌతాను సైయాటతో వసంతాలు తెస్తానులే నవ్వుతో
సూర్యుడ్ని దాస్తాను నాచూపులో జనాలంతా రావాలి నాపాటలో
నిప్పల్నే గుప్పిస్తా నీతిలేనప్పుడు మల్లెల్లో చల్లిస్తా మనసకున్నప్పుడు

చరణం 2

మనసుండీ పండేటి మాగాణిగ వయస్సుందిలే నిత్యకళ్యాణిగ
పరువాల పాదాల పారాణిగ వరించను ఈజన్మ రారాణిగ
ఆనింగి ఈనేల హాద్దులేరావులే కాలాలు కర్మాలు అడ్డుకోలేవులే ||బాలీ||