తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా

పల్లవి

తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరిణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆ ... పంచవన్నె రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మోలకా
పంచవన్నెల రామచిలుక పంచదారల ప్రేమచినుక

చరణం 1

మాణిక్య వీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వే
నామనసు మందిరాన మూగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాద్య దేవతనువ్వే గంధర్వ కాంతపు నువ్వే
స్వర్గాల దారిలోనా నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే
[ఆమె] నీగాలి సోకింది నాకొమ్మ ఊగింది
నీ ప్రేమ నాదంది నాజన్మ పొంగింది
[అతడు] పంచవన్నెల రామచిలుక నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మెలకా ||పంచ||

చరణం 2

[అతడు] నాతేనె విందువు నువ్వే నాలంకె బిందువు నువ్వే
నాగుండె గంపలోనా మొక్కుకున్న అంతులేని సంపద నువ్వే
నాపొద్దు పొడుపువు నువ్వే నాభక్తి శ్రద్ధవు నువ్వే
చిననాడు దిద్దుకున్న వత్తికైన ఓనమాలు నువ్వే నువ్వే
[ఆమె] నీ చెంప అందింది నాచెంద కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది ||పంచవన్నెల|| తళ||