పల్లవి
కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలి కావ్యం నేనై నిలవాలి ||కన్నులు . . .||
చరణం 1
మనసు నేనై ఉండాలి మమత నీవై నిండాలి
కడలి నేనై పొంగాలి నదివి నీవై తేరాలి
నదివీ నీవై తేరాలి ||కన్నులు||
చరణం 2
తొలకరి నీవై చిలకాలి మెలకను నేనై మొలవాలి ||2||
దైవం నీవై నిలవాలి ధర్మం నేనై నడవాలి
ధర్మం నేనై నడవాలి ||కన్నులు||
చరణం 3
శిల్పం నీవై కల్పం నేనై చిరకాలం జీవించాలి ||2||
చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి ||2|| ||కన్నులు||
కన్నులు నీవే కావాలి
విభాగములు:
- ఎ.యన్.ఆర్,
- కాంచన,
- రాజ శ్రీ,
* ఘంటసాల,
* సుశీల,
# యుగళ గీతాలు,
+ సిరి సంపదలు 2,
$ అ - అః