పల్లవి
[ఆమె] మల్లెలవాన మల్లెలవాన నాలోన
మనసంతా మధుమాసంలో విరబూసేనా ||మల్లెల||
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతినిముషానా ||మల్లెల||
చరణం 1
చిన్న చిన్న సంగతులే సన్నజాజి విరిజల్లు
తుళ్లుతున్న అల్లరులే ముళ్లువేసి రోజాలు
[అతడు] అందమైన ఆశవై చిందలాడు ఊహలే నందనాల పొదరిళ్లు
[ఆమె] గుప్పెడంత గుండెలో గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
[అతడు] ఓ . . . వన్నెల పరవళ్లు పున్నాగ పరిమళాలు
[ఆమె] వయసే తొలిచిత్రం చూసే సమయాన
మైమరచే ఆనందాలే ప్రతినిముషాన ||మల్లెల||
చరణం 2
[అతడు] కొమ్మలేని కుసుమాలు కళ్లలోని స్వప్నాలు
మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు
[ఆమె] కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే - పారిజాతహారాలు
[అతడు] ముద్దుగుమ్మ ఎదలో మెగ్గవిచ్చు కధలే - ముద్దమందారాలు
[ఆమె] హొయ్ నిత్య వసంతాలు ఈపులకింతల పూలు
[అతడు] ఎప్పుడు వసివాడని వనమై హృదయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిముషాన ||మల్లెల||