పుల్లనీ పుల్లట్టు పంటికంటగానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా
ఇదీ అట్టంటే ఈ హ ||పుల్లనీ పుల్లట్టు||
వేసేటి అట్లమీద యావ పుట్టగానే ఏ సిలో తిండి మీద ఎగటు పుట్టెరా
ఫైవ్ స్టార్ మీద బెట్టు మన అట్టే బెస్టు
మీ అందరి మీద ఒట్టు మినపట్టే టేస్టు
చరణం 1
రాతి రోలులోన పిండి రవ్వలోన కలిపి
రేకుపెనం మీదన రవ్వంత నూనె దులిపి
కట్టె పొయ్యి మీద దాన్ని అట్లకాడతో కాల్చి
పొడి కారం పైన చల్లి పొగసూరకుండ దీసి
కాలుతున్న అట్టు ముక్క నాలిక మీదెట్టుకుంటే... ||2||
నసాళానికెక్కి మంచి హుషారు పుట్టిస్తదిరా.. పుల్లట్టు
అబ్బబ్బబ్బా... ||పుల్లనీ పుల్లట్టు||
చరణం 2
కట్లెట్లు పిజ్జాలు దీనిముందు దిగదుడుపు
నూడుల్సు చికెను రోల్సు అరగవురా పరగడుపు
హాటు డాగ్స్, బర్గర్లని ఇంగిలిపీసు మరిగినోడు
ఫాస్ట్ ఫుడ్డు తిన్నాక టేస్టు మర్చిపోతాడు
తెలుగింటి పుల్లట్టు తిన్నోడు ఎవడైనా ఓ... ||2||
పదేళ్ళైనా మరిచిపోడు పదే పదే అడుగుతాడు.. పుల్లట్టు
అట్టు అట్టు అట్టు ||పుల్లనీ పుల్లట్టు||