పల్లవి
హొయ్ అనగనగా కధలా ఆరిళ్ళకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
లోకాల చీకటినీ తిడుతూనే ఉంటామ
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమ
ఆ వెలుగులికి తొలి చిరునామ అదె ఒకటే చిరునవ్వే నమ్మ ||అనగనగా||
చరణం 1
ఓరి బాదలో కన్నులో కందినంత మాత్రాన పోయిన కాలము పొందలేముగా
రేగిన గాయమే ఆరనంత మాత్రాన
కాలమే సాగక ఆగిపోదుగా అరె ఈనేల ఆకాశం ఉందే మన కోసం
వందేళ్ళ సంతోషం అంతా మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేల అల్లరిచేద్దాం||అనగనగా||
చరణం 2
ఎందుకో ఏమిటో ఎంతమందిలో వున్నా
నా ఎద నీజతే కోరుతుందిగా
వంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వెంట ఉండవా
హేయ్ కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి
కలిపేస్తూ నీ చేయి అడుగా చిందెయ్యి
మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కధ కావాలి