పల్లవి
నువ్వెంత అందగతైవైనా గాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్నికాదుగద కన్నె వయసా
నీకంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే . . . నిన్నే . . . నేను కోరుకున్నది నిన్నే . . .
నన్నే . . . నన్నే . . . ఒప్పుకోక తప్పదింక నన్నే . . .
చరణం 1
ఔను అంటే నిను చూసుకోనా మహరాణి తీరుగా
కాదు అంటే వదిలేసి పోను అది అంత తేలికా
లేనిపోని నఖరాలు చేస్తే మరియాద కాదుగా . . .
ఇంతమంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా
తగని వాడినా చెలీ తగువు దేనికే మరీ . . .
మనకు ఎందుకే ఇలా అల్లరీ . . . ||నువ్వేంత||
చరణం 2
కన్నెగానే ఉంటావా చెప్పు ఏజంట చేరక . . .
నన్ను మించి ఘనుడైన వాణి చుపించలేవుగా . . .
మీసమున్న మగవాణ్ని గనక అడిగాను సూటిగా
సిగ్గు అడ్డుపడుతుంటె చిన్న సైగైన చాలుగా
మనకి రాసి ఉన్నది . . . తెలుసుకోవె అన్నది . . .
బదులు కోరుకున్నది . . . నామది . . . ||నువ్వేంత||