మనసా మౌనమా మదిలో రాగమా

పల్లవి

[అతడు]మనసా మౌనమా మదిలో రాగమా
[ఆమె] మనసా క్షేమమా మనిషి ప్రాణమా
[అతడు] చిగురులు వేసే క్షేత్రమా చినుకై రాలే మేఘమా
[ఆమె] చెరగని కావ్యం బంధమా కరగని దూరం కాలమా
[అతడు] యెద లోతుల్లో ఆనందమా ||మనసా||

చరణం 1

[అతడు] నీలాకాశం సాహసంతో తారాలోకం సాగే వేళ
ప్రేమావేశం ప్రాణం పోసే గుండెల్లోనా
[ఆమె] సాయం సంధ్యా నారింజల్లో సాయం కోరే నీరెండల్లో
తోడు నీడ ప్రేమా గూడు నీదే కదా
[అతడు] వలచి పిలిచే నాలో ఆశవైనా శ్వాసవైనా నీవేమైనా ||మనసా...||

చరణం 2

[అతడు] పూబంతి బుగ్గల్లోనా రోజూ రంగు సిగ్గుల్లోనా నీ అందాల
శ్రీగంధాలే పూసే వేళ
[ఆమె] మాటేలేని కన్నుల్లోనా పాట పాడే పాపల్లోనా నీ చూపుల్లో నీ బంధీగా చిక్కే వేళ
[అతడు] జతగా శృతిగా అనురాగం యోగం వేగం
అయ్యే సంతోషాన