పసిఫిక్‌లో దూకేయమంటే

పల్లవి

[ఆమె] పసిఫిక్‌లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తయినా ఎక్కేస్తానే నీ కోసం ||పసి||
తలకోన జంగిల్‌లోనా జాగింగ్ చేస్తా జంటై నువ్వుంటే
భామ రోమియోకన్న నేనే పిచ్చివాణ్ణమ్మి
నువ్వు కాసుకోమన్నా లవ్ బిచ్చ గాణ్ణమ్మ ||పసి||

చరణం 1

[అతడు] పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు
[ఆమె] కుర్రాడికి మనసైతే ప్యార్ ప్యార్ మంటాడు
[అతడు] టెలిస్కోప్ చూడలేని వింతకాదా ప్రేమగాధ
[ఆమె] టెలిఫోన్ తీగచాలు సాగుతుంది ప్రేమబాట
[అతడు] భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమేకాదా
[ఆమె] తోడువస్తున్నా ప్రేమతోడుకుంటున్నా
[ఆమె] పసిఫిక్‌లో దూకేయమన్నా దూకేస్తావా నాకోసం
ఎవరెస్ట్ ఎత్తెంతైనా ఎక్కేస్తావా నాకోసం

చరణం 2

[అతడు] నీ ఒంపుల కెంపుల్లో ప్రేమపూజ చేస్తున్నా
[ఆమె] నీ గుండెల గాదుల్లో ప్రేమపూవు నవుతున్నా
[అతడు] కరెన్సీ నోటుకన్నా కాస్టుకాదా ప్రేమపాట
[ఆమె] కరెంటు కాంతికన్నా బ్రైటుకాదా ప్రేమబాట
[అతడు] నాలోపాట అర్థంకాదా వద్దకురావే ముద్దుల రాధా
[ఆమె] సిగ్గుపడుతున్నా అయినా సిగ్నలిస్తున్నా ||పసి||