రాధే గోవిందా ప్రేమే పుట్టిందా

పల్లవి

[ఆమె] రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసీగా రమ్మంటు కబురెట్టిందా...
[అతడు] కృష్ణ ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనస్సే లాగేసిందా
[అతడు] ప్రియపురుషా వరసా ఇంకా కలిపెయమంటా
[ఆమె] మృదువదనా పతినై పరిపాలించనా
చల్లో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ ||రాధే||

చరణం 1

[ఆమె] నీ కోసమే పుట్టాననీ వూరించకోయ్ వాస్సాయనా
[అతడు] నా కోసమే వచ్చావనీ వాటేయనా వయ్యారమా
[ఆమె] తొలిప్రేమ జల్లులే కురవాలంటా
పరువాల పంటలే పండాలంటా
[అతడు] చలిబుగ్గ సిగ్గుతొ మెరవాలంటా
కైగిళ్లజాతరే జరగాలంట
[ఆమె] అరే ఆకలివేస్తే సోకులిస్తా చూపులుతోటి షాకులిస్తా
ఒడిలో సరాసరి పడకేస్తే మామా ||కృష్ణ ముకుందా||

చరణం 2

[అతడు] అంగంగము వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే
[ఆమె] వదిలేసేనే మోమాటమే సాధించావోయ్ సల్లాపమే
[అతడు] రతిరాణి దర్శనం ఇవ్వాలంటా
ఏకాంత సేవలే చేయాలంట
[ఆమె] కసిగువ్వరెక్కలే విప్పిందంటా
నీ కోసమే పక్కలే పరిచిందంటా
[అతడు] అరే మెత్తకువస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా
సరినే మగసిరిలో దోచేస్తా భామా ||రాధే||