అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ

పల్లవి

[అతడు] అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ - 4
అటవి ముల్లంటి పడుచోయమ్మ, మరదలు కూన అదిమరలకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు చానా
అరె కన్ను, కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క,
జున్ను ముక్క జుర్రుకుపోనా, చక్కని చుక్కా
[ఆమె] అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
మొగలిపూవంటి మొగుడోయమ్మ
మరువపు తేమ, తెగమరిగిన మామ, కొరకని జామ ఈ చిలకదిరామ
చుక్కాలొచ్చేదాక నిన్ను ఆపేదెట్టా,
ఒహొ దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా

చరణం 1

[అతడు] హే . . . జమాయించూ
[ఆమె] ఓ . . . తమాయించు
[అతడు] పువ్వులబోనాలు, చిరునవ్వుల దాణాలు,
పుంజుకు పెట్టేస్తే లేత ముంజుల ముద్దిస్తా
[ఆమె] వెన్నెల బాణాలు, నులివెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మామ జాతరకొచ్చేస్తా
[అతడు] హే . . . ఒంపుసొంపు వాగువంకై వచ్చేస్తావా
[ఆమె] యహ్ . . . కట్టూ బొట్టూ తేనెల పండూ గుచ్చేస్తావా ||అల్లేల్లే||

చరణం 2

[ఆమె] హే . . . యమాగుంది
[ఆమె] ఈ . . . జమాబందీ
[అతడు] చింతల తోపుల్లో నీ చింతల దోచేస్తా
సంతల బేరాల్లో భీమా సిగ్గులు తూచేస్తా
[ఆమె] చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మామ చాటుగ సందిస్తా
[అతడు] హే . . . రేపోమాపో లగ్గా లెట్టి లంగర్‌లేసేస్తా
[ఆమె] అహా . . . ఆటూపోటూ అడ్డేటేని ఒడ్డే చూస్తా ||అల్లేల్లే||