కన్ను కన్ను కలుపుకొని

పల్లవి

[అతడు] కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని ||2||
ఆ కలనై సాగాలి ఆకాశం దాటాలి
[ఆమె] గువ్వలమవుతూ రివ్వు రివ్వు రివ్వంటుంటే తారాగణం
మాకందిస్తుంది నీరాజనం ||కన్ను||

చరణం 1

[ఆమె] పొదరిళ్లు పూలపళ్లు హరివిల్లు
లేళ్లు కుందేళ్లు వీళ్లుంటే చాలు
[అతడు] స్వర్గంలో సంసారం స్వప్నాలే సంతానం
[ఆమె] ఆ జాబిలే మా నెచ్చిలి ఈ కౌగిలే మా లోగిలి
[అతడు] చెక్కిలి గింతల చుట్టాలు కందిన గుర్తులు కష్టాలు
[ఆమె] ప్రణయాలే మా పోకలు ||కన్ను||

చరణం 2

[అతడు] చైత్రాలు సంగీతాలు సరదాలు సందళ్లు
మాదేశంలో సిరులు సంపదలు
[ఆమె] ముచ్చట్లే రత్నాలు మురిపాలే వరహాలు
[అతడు] ముద్దాటలే ముప్పూటలు ముత్యాలయ్యే ముచ్చెమటలు
[ఆమె] అల్లరి చెండులే నాట్యాలు తుంటరి నవ్వులే గానాలు