తియతీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో

పల్లవి

తియతీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో...
నేనవరన్నది నేమరిచి పోగలను చూస్తూ నీ కళ్ళలో...||తియతీయని||

చరణం 1

చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలువేమిటో
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చిరాని కన్నీళ్ళకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు భాధేమిటో...||తియతీయని||

చరణం 2

మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో
కలిసుంటే కాలం నిలిచి పోతుంది ప్రేమ సంకెళ్ళలో ||తియతియ్యని||