మోనాలిసా మోనాలిసా మోనాలిసా మోనాలిసా

పల్లవి

మోనాలిసా మోనాలిసా మోనాలిసా మోనాలిసా
నా మనసునే చేశావులే నీ బానిసా
నీ ప్రేమకై వూగిందిలే ఎదవూగిసా

చరణం 1

అవతరించింది భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీ వైపే చూడగా
శిరసు నూపింది పువ్వు నీ సిగలో చేరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెత్తానులే నీ ప్రేమ పొందగా
ధన్యమయ్యానులే నీ చూపు సోకగా
జంటగా చేరగా మారిందిలే నా దశ ||మోనాలిసా||

చరణం 2

మోగిపోవాలనుంది మది గుడిలో నాదమై
మెరిసి పోవాలనుంది పెదవింట్లో నవ్వునై
ఒదిగి పోవాలనుంది కౌగిట్లో కాలమై
నిలిచి పోవాలనుంది పాపిట్లో తిలకమై
బిగిసి పోతానులే నీ కంటి బిందువై
నిత్యమూ చేయనా నీ గుండెలోన బస ||మోనాలిసా||