ఏ తీరుగనను దయజూచెదవో

ఏ తీరుగనను దయజూచెదవో ఇనవంశోత్తమరామా||ఏ తీరుగ||
నా తరమా భవసాగర మీదను నళిన దళేక్షణ రామా||నా తరమా||
శ్రీ రఘునందన సీతా రమణా శ్రిత జన పోషక రామా||శ్రీరఘు||
కారుణ్యలయ భక్త వరద నిన్ను కన్నది కానువు రామా||కారుణ్యా||
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా||క్రూర||
దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా||దారి||