నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

పల్లవి

[అతడు] నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీప్రేమే లేకుంటేబ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకొను నాకు తప్పా
కన్నులకు కలలు లేవు నీరు తప్పా ||నువ్వంటే||

చరణం 1

మనస్సు ఉంది మమత ఉంది పంచుకునే నువ్వు తప్పా
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్పా
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనే
ప్రేమిస్తేనే సుధి యుగ నరకం నిజమేనే
ఎవరిని అడగాలి నన్ను తప్పా
చివరికి ఏమవ్వాలి మన్ను తప్పా ||నువ్వంటే||

చరణం 2

వెనకొస్తానన్నావు వెళ్లొస్తానన్నావు జంటై ఒకరిపంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు ఉరివైపోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
దీపం కూడా దహిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా
ఎవరిని నిందించాలి నిన్నుతప్పా ||నువ్వంటే||