పల్లవి
ఈ బంధనాల నందనాన్ని నీరుపోసి పెంచిన పైవాడు
తన కోవెలంటి కాపురాన్ని చేతులారా పాడుచేసి ఏం సాధించాడు
ఈ అందమైన బొమ్మరిల్లు ఊరువాళ్ళ కళ్ళముందు చేసిందెన్నాళ్ళు
ఏ చూడలేని పాడు కళ్ళు దిష్టి కొట్టి కుప్పకూలి పోయిందీనాడు
మనిషే దేవుడై మనసులోగిలి
కలి కాలానికి కధలేమోనని
సందేహించడా దైవము ఓ . . .చేసాడా ఈ ద్రోహము ||ఈ||
చరణం 1
రెండు రూపులున్నా ఒక్క ఊపిరయ్యే బంధం గొప్పదా
రెప్పపాటులోనే బుగ్గిపాలుచేసే పంతం గొప్పదా ||2||
ప్రేమంతా బలహీనమా పగసాధిస్తే ఘనకార్యమా ||2||
మమకారాలు మసిచేస్తే సంతోషమా
ఇది నీ సృష్టికే సొంతమా ఓ . . . దయలేని ఓ దైవమా ||ఈ||
చరణం 2
మామిడాకు తోరణం మల్లెపూల మండపం కలగా మిగులునా
పచ్చనైన పందిరే చిచ్చురేపు కక్షతో చితిగా రగులునా ||మామి||
కోరింది కళ్యాణమా కానుంది కల్లోలమా ||2||
కసికాటేసి పోయేటి ఓ కాలమా
పదికాలాలతో దూరమా ఓ . . .నీవేట సాగించుమా ||ఈ||