పల్లవి
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత నాపాటల తీగ తొలిపూట
నాలుగు దిక్కులు నాచిరుపాటలు అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నాపయనం
చరణం 1
పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిల లింట్లో శ్రోతల వరుసలలో
శిలవైన చిగురించెను ఆపల్లవి పలుకులలో
ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే
ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే
చరణం 2
బ్రతుకే పాటగామారి బాటయే మార్చగా
వెతికే వెలుగులో కాలే ఎదురుగా చేరగా
అణువణువు ఇటు వింటున్నా నాస్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపనయై
పాటల జగతికి ఏలే రాణిగ వెలిగే శుభవేళ