సుప్రభాతంలో మేలుకున్నానా

పల్లవి

సుప్రభాతంలో మేలుకున్నానా, స్వపనలోకంలో తేలుకున్నానా
నువ్వేదో అంటేనేను విన్నానా, పరాగ్గా ఉండీ అవుననుకున్నానా
ఈ నిజమంతా నిజమేనా నీ జత రుజువనుకోనా ||సుప్ర||

చరణం 1

మంచయినా మాయే అయినా కావాలని చేసావే
అచ్చంగా నాకు నువ్వే కావాలనుకున్నానే
నమ్ముతున్నా నవ్వుకున్నా, మెచ్చుకున్నా నొచ్చుకున్నా
నిత్యము నాధ్యాసా నీకంకితం చేసేసా
నేను తీసేశ్వాసా నిలువెల్ల నీపైఆశా
ప్రాణనాడులను వీనతీగలుగ మీటుతున్న హాయిలా ||సుప్ర||

చరణం 2

నా అడుగుల ప్రతిబాటా నీవైపే నడిచిందీ,
నా పెదవుల ప్రతిమాటా నీపేరే పిలిచింది
అందరాని తారవైనా అంతులేని దారివైనా
ఆగనంది ప్రాణం నీజంట కలిసేవరకూ ఆపకంది పయనం
నే ప్రేమగెలిచే యింతకన్నా తపమంటూ ఉండదని ఒట్టువేసి చెప్పనా ||సుప్ర||