పల్లవి
[అతడు] మనసన్నది నాకున్నది, ప్రేమన్నది దరిరాకున్నది.....2
నా హృదయంలో ఒకరికిది అదినూరేళ్ళయినా తనకైవేచి ఉంటుంది ||మన||
చరణం 1
ఒక యదపై కరుణతోటి స్వాతివాన చిలుకుతుంది ప్రేమ ఈ
ప్రేమ మరొకరిపై కక్షబూని సాగరాన ముంచుతుంది ప్రేమ
ఈ ప్రేమ గడ్డి పూవునైన గులాబి పూవుగా మలచగా,
తులసిమొక్కనైనా గంజాయిలాగ చూపదా
త్యాగం స్వార్థం, మోసం మురిపెం . . .2
అన్నింటికీ అర్థం ఒన్లీ లవ్ ఒన్లీ లవ్ ||మన||
చరణం 2
ఒకసారి తల్లిలాగ జోలపాట పాడుతుంది ప్రేమ ఈ ప్రేమ
మరోసారి కాళిలాగ జ్వాలలోన కాల్చుతుంది ప్రేమ ఈ ప్రేమ
పాడు గుణమునైనా ఆదరించి చూడగా
మంచితనము పైనా చీదరింపు చూపదా
స్వర్గం నరకం సౌఖ్యం, శోకం . . .2
అన్నింటికీ మార్గం ఓన్లీ లవ్ ఓన్లీ లవ్ ||మన||