నీ నవ్వులే వెన్నెలని మల్లెలని

పల్లవి

[అతడు] నీ నవ్వులే వెన్నెలని మల్లెలని, హరీవిల్లులనీ . . .
ఎవెరోవేవో అంటే అననే ఏంచెప్పను ఏవీ చాలవనీ . . .

చరణం 1

బంగారం వెలసిపోదా నీసొగసుని చూసి . . .
మందారం మురిసి పోదా నీ సిగలో పూసి . . .
వేవేల పువ్వులను పొగేసి నిలువెత్తు పాల బొమ్మని చేసి . . .
అణు వణువు వెండి వెన్నెలపూసి, విరితేనె తోనే ప్రాణం పోసి . . .
ఆబ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి . . .
తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి . . .

చరణం 2

పగలంతా వెంటపడినా చూడవు నావైపు . . .
రాత్రంతా కొంటెకలనై వదలవు కాస్సేపు . . .
ప్రతిచోట నువ్వె ఎందురోస్తావు ఎటు వెళ్లలేని వల వేస్తావు . . .
చిరునవ్వునే ఉరివేస్తావు . . . నన్నెందుకింత ఉరిస్తావు
ఒప్పుకోంఏం నువ్వు చేసిందంతా చేసి
తప్పునాదంటావా నానా నిందలేసి