చెలిసోకు లేత చిగురాకు

పల్లవి

[అతడు] చెలిసోకు లేత చిగురాకు, పలుకేమా కాస్త కరుకు
[ఆమె] కవికాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
[అతడు] ఎన్నళ్లే నీకూ నాకూ తగువులు
[ఆమె] నివల్లే కాదా నాకీ చిక్కులు
[అతడు] కోపంలో కూడా ఎంత నాజూకు

చరణం 1

అన్నానంటే అన్నానంటావు అంతే గాని ఆలోచించవ్
నీనే కాదా నీకుండే దిక్కు
[ఆమె] నాకోసం నువ్వు పుట్టానాంటావ్, నేనంటే పడిచాస్తానంటావ్
నీకెంటంట నాపై ఈ హక్కు
[అతడు] ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మ వెందుకు
పోమ్మంటు దూరం చేస్తావెందుకు
[ఆమె] చేప్పిందే మళ్లీ మళ్లీ చెప్పకు
నన్నిట్లా నానా హింస పెట్టి చంపకు ||చెలి సోకు||

చరణం 2

[అతడు] దగ్గరకోస్తే భగ్గంటున్నావ్. . . పక్కకు పోతే భయపడుతున్నావ్
ఇట్లాగైతే ఎట్టాగే మరి . . .
[ఆమె] ఆవైపంటే ఈ వైపంటావ్ . . . నే లెఫ్ట్ అంటే నువు రైట్ అంటావ్. . .
నీతో అన్నీ పేచీలేమరీ . .
[అతడు] ఆపాదం కందేలాగా పరుగులెందుకే . . .
నీభారం నాకే ఇవ్వకా . . .
[ఆమె] మాటల్లో మంత్రం వేస్తూ తియ్యగా
మైకంలో ముంచేస్తావా మెల్ల మెల్లగా . . . ||చెలి సోకు||