పల్లవి
బంతి కావాలా? బాలు కావాలా?
మెంతికూరలాంటి పిల్ల చెంతకొచ్చి చేరుకుంటె . . .
బంతెందుకు? బాలెందుకు? ఏదేదో అడగరాదూ . . . ఇవ్వనన్నానా . . .
ర్యాలీ రావులపాడు రేలంగీ సంతలోన
నిప్పుకోడి తెచ్చినాను . . . నిప్పుకోడి తెచ్చినాను
పెట్టియ్యవే పిల్లా పెట్టియ్యవే . . . పెట్టియ్యవే ఇగురు పెట్టియ్యవే . . .
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా వగలమారి బుల్లోడా
వాల్తేరు బుల్లోడా . . . అంతగాను అడుగుతుంటే పెట్టీయనా
అటక మీద పాత ట్రంకు పెట్టియ్యనా......ట్రంకు పెట్టీయ్యనా . . .
కర్నూలు టౌనులోని కంసాలి కొట్టులోన
పట్టగొలుసు తెచ్చినాను . . . పట్టగొలుసు తెచ్చినాను
కాలియ్యనే పిల్లా కాలియ్యవే కాలియ్యవే....నీ కుడి కాలియ్యవే . . .
ఓరోరి బుల్లోడా ఒయ్యారి బుల్లోడ . . . వగలమారి బుల్లోడా
వాల్తేరు బుల్లోడా వెంటపడుతు వేడుకుంటే కాలివ్వనా
ఇంటికెళ్లినాక ఫోను కాలివ్వనా ఫోను కాలివ్వనా
చరణం 1
మంత్రిగారి కోటలోన మన ఇద్దరి పేరుమీన
రైలుటికెటు తెచ్చినాను. . .రైలు టికెటు తెచ్చినాను
చుట్టేయ్యవే . . . పిల్లా చుట్టేయ్యవే . . . చుట్టెయ్యవే . . .బిస్తరు చుట్టేయ్యవే . . . ||ఓరోరి||
పట్టుపట్టి అడుగుతుంటె చుట్టివ్వనా
అంటు పెట్టుకుంటె గంట చుట్టివ్వనా . . . గంట చుట్టివనా . . .
అడిగింది అందుకోక అందేది అడగలేక
నీరుగారి పోయినావు . . . నీరుగారి పోయినావు
చారెయ్యనా పిలగా చారెయ్యనా చారెయ్యనా ఉలవ చారెయ్యనా ||ఓసోసి||
చిలిపి చిందులాటలోన చారెయ్యవే ఏక్, దో, తీన్,
చారెయ్యవే . . . చారు, పాంచెయ్యవే . . .
చరణం 2
షామీరు పేటలోన షావుకారు షాపులోన
నోటుబుక్కు తెచ్చినాను . . . నోటుబుక్కు తెచ్చినాను . . .
రాసియ్యవే. . .పిల్లా రాసియ్యవే . . . రాసియ్యవే . . . అందం రాసియ్యవే . . . ||ఓరోరి||
పాత్తుకోరి చేరుకుంటె రాసెయ్యనా . . .
నెత్తిమీద మంచినూనె రాసెయ్యనా . . .
మాటల పోటీలోన మీది మీది ఆటలోన
పిల్లతోటి ఓడినావు పిల్లతోటి ఓడినావు
తీసెయ్యరో పిలగా తీసెయ్యరో తీసెయ్యరో మీసం తీసెయ్యరో ||ఓసోసి||
మీసకట్టు ముద్దులాట కడ్డం అంటూ
చెప్పలేక చెప్పినావే తీసెయ్మంటూ. . . మీసం తీసెయ్మంటూ . . .