పల్లవి
వేణుమాధవా. . .ఏశ్వాసలో చేరితే గాలి గాంధర్వ మౌతున్నదో
ఏమోవిపై వాలితే మౌనమే మంత్ర మౌతున్నదో . . .
ఆశ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై నినుచేరనీ మాధవా . . .
చరణం 1
మునులకు తెలియని జపములు జరిపినదా మురళీసఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలుపున తొలచిన గాయములే తనజన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరిందీ ... అష్టాక్షరిగ మారిందీ
ఎలా ఇంత పెన్నిధీ వెదురుతాను పొందింది వేణుమాధవా ... నీ సన్నిధీ ...
చరణం 2
చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ
నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులసడి వినపడక హృదయానికీ
అలజడితో అణువణువూ తడబడదా ... ఆఁ ...
నువ్వే నడుపు పాదమిదీ నువ్వేమీటు నాదమిదీ
నివాళిగా నామది నివేదించు నిమిషమిది ... వేణుమాధవా ... నీసన్నిదీ ...
గాగ్గరి గరి సరి గాగ్గ రీరి సరి
గపద సాస్స దప గరి సరీ
గగగదపదా గపదసదా
దా పా గా రీ గా
దపద సాస్స దపద సాస్స
దపద రీర్రి దపద రీర్రి దసరి గరి సరీ
గరిసరీ దా రి గారి సరిగా రిస దప
గగగపాప్ప గగగదాస్స గగగసాస్స
దపగపగరి సరిసరి గరి సరిస దసరీ
గదప సగరీ
పగపసరీ సరిగపగరీ సద
పదపసదస పదపసదస
పదప రిసరి నదన రిసరి
పద సరి గరి సద పదస గగస రిదస
సరిగపదసరిగా..
రాధికా హృదయ రాగాంజలీ నీ పాదముల వ్రాలు
కుసుమాంజలీ ఈ గీతాంజలీ ...