పల్లవి
[అతడు] ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకి చ్చినావు
ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది ||ప్రేమా||
చరణం 1
[అతడు] పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు
[ఆమె] వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటి చెరిగేలా ఆ కంటి చూపు
[అతడు] వేకువ జామున వాకిట వెలిసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమున సిగ్గులు జల్లే నా చెలి మందారం
[ఆమె] ఎంత చేరువై వుంటే అంత సంబరం ||ప్రేమా||
చరణం 2
[అతడు] ఏటిలో తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతోంది
[ఆమె] కంటికి కునుకంటూ రాను పొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటూంది
[అతడు] ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం
అందాకా మరి ఆగామంటే వింటుందా హృదయం
[ఆమె] వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవ ||ప్రేమా||