ఒక దేవత వెలిసింది నా కోసమే

పల్లవి

ఒక దేవత వెలిసింది నా కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ||ఒక||
సంధ్యా కాంతుల్లోని శ్రావణిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోన పున్నమిలా
శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని . . . ||ఒక||

చరణం 1

విరిసే వెన్నెల్లోనా మెరిసే కన్నుల్లోనా
నీ నీడే చూసానమ్మ
ఎనిమిది దిక్కుల్లోనా నింగిలి చుక్కల్లోనా
నీ జాడే వెదికానమ్మ
నీ నవ్వే నా మదిలో అమృతవర్షం
ఒదిగింది నీలోనే అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలకు ముగ్గులు వేసి
మునుముందుకు వచ్చేనే చెలినే చూసి
అంటుందమ్మా నా మనసే
నిన్నే ప్రేమిస్తానని . . . ||ఒక||

చరణం 2

రోజూ మొక్కలు నాటి ప్రాణం నీరుగపోసి
పూయించా నీ జడకోసం
రోజూ ఉపవాసంగా హృదయం నైవేద్యంగా
పూజించా నీ జతకోసం
నీరెండకు నీ వెంటే నీడైవచ్చి
మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించి
ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
ఇన్నాళ్ళు అనుకోలేదే
నిన్నే ప్రేమిస్తానని . . . ||ఒక||