పల్లవి
కలగంటి . . . కలగంటి ఇప్పుడిటి కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశుగంటి ||కలగంటి||
చరణం 1
అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి,
శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటీ చతురాస్య పొడగంటి . . .
చతురాస్యు పొడగంటి . . . చయ్యన మేలుకొంటి
చరణం 2
అరుదైన శంకచక్రాదు లిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరువేంకటాచలాధివుని చూడగగంటి
హరిగంటి గురగంటి అంతట మేలుకంటి ||కలగంటి||