అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి

పల్లవి

[ఆమె] అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి
తెలిసేనమ్మా ఓహొ ఓహొ ఓహొ ఓహొ
ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా నువ్వే చాలని ప్రేమ ఓహొ ఓహొ ఓహొ
[ఆమె] గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పేందుకు మాటే ఎలా
[అతడు] వెన్నెలే పండినది కన్నె మనస్సు నిండినది తేటేందుకు ఉన్నదిచాలు
[ఆమె] మౌనం లోని ఆ భాషలు ఎన్నో చూపులలోని దాగెను భాసలు ఎన్నో
[అతడు] విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది గుప్పెట్లో అంతా ఉంది
గుట్టు దాగుంటే బాగుంటుంది ||గుండెలలో...||

చరణం 1

[అతడు] కళ్ళే పలికించు మదిలో మాటలను ఇంకా పెదవిప్పే చెప్పాలా
[ఆమె] నవ్వే ఉలికించు అవునను సైగలను అయినా వివరించి తెలపాలా
[అతడు] ముఖమంతా కాంతులతో వెలిగేనమ్మా
మనసంతా ఆ వెలుగులో తెలిసేనమ్మా
[ఆమె] పెదవుల్లో ఆ మధవే పొంగే వేళ ప్రేమంటు పేరే ఎలా
నువ్వు నేనంటు వేరవ్వాలా ||గుండెలలో...||

చరణం 2

[అతడు] తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలు ఎలా వస్తాయో అలాగే
[ఆమె] ప్రేమే విరిశాకా ఒంటికి పరిమళము తానై వస్తుంది ఎలాగా
[అతడు] ప్రేమన్నది భాషలకు అసలందదులే మౌనంగా ధ్యానంగా తానుండులే
[ఆమె] ఊహలతో నింపేస్తే అది నిలవదులే కలగంటు
పాటలు ఎలా ప్రేమ కలగంటు మాటలు ఎలా ||గుండెలలో...||