పల్లవి
[అతడు] అమ్మదేవుడో అనిపించావే అయ్యో బ్రహ్మయ్యా
ఏమో నీదయ నాపై లేదయా
[ఆమె] ఓరి దేవుడో యెదలో రేగే ఇదేంగోలయ్యో ఈ కధ ఏందయ్యా తెలిసేదెట్టయా
[అతడు] మదిలో ఏదో గొట్టే గొట్టే [ఆమె] గుండెల్లో సునామి పుట్టే
[అతడు] ఏడుకొండల వెంకటేశ్వరా నువ్వు నాకు దిక్కు
ఏదునాళ్ళుగా కోడి సాక్షిగా ఎంగిలడితే ఒట్టు
[ఆమె] వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు
నిండు సాక్షిగా రెండు కన్నుల నిద్దరోతే ఒట్టు ||అమ్మదేవుడో...||
చరణం 1
[అతడు] ప్రపంచ వింతలు ఏడున్నా మరొక్కటి ఇక్కడ చూస్తున్నా
ప్రతొక్క చెలిమాటే వినిపించేలే
[ఆమె] జగాన ఎందరు గనులున్నా జనాలు మెచ్చే
పొగరున్నా మగాడు మాత్రం నా ప్రియుడే అనిపించేనే
[అతడు] ఒక నవ్వే అది చాలు తన చిరునవ్వే అది పదివేలు
[ఆమె] తగువే అనిపించే ఇక తనతోటే సరదాలు
[అతడు] ఏడుకొండలు వెంకటేశ్వరా పొద్దు పోకవుందిక
ఎంతమందిలో కలిసి ఉండినా నాకు తోచకుంది
[ఆమె] వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్ట పట్టు
నిండు సాక్షిగా రెండుకన్నులా నిద్దరోతె ఒట్టు ||అమ్మదేవుడో...||
చరణం 2
వయ్యారమంతా నాలోన వసంతమాడే తరుణాన
వరించి నే నే పెళ్ళాడే వరుడతడేలే
[అతడు] గతాల జన్మలు ఏవైనా మరింక జన్మలు ఎన్నున్నా
యుగాలు నాకు తోడుండే సఖి తానేలే
[ఆమె] నా జంటై తానుంటే చలి మంటేగా చనువరులు
[అతడు] ముద్దై మురిపిస్తే బదులిస్తాగా మగసిరులు
[ఆమె] వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు
నిండు సాక్షిగా రెండు కన్నులా నిద్దరోతె ఒట్టు
[అతడు] జమ్మి కొండల జంబుకేశ్వరా యెదను హత్తుకుంది
అందువల్ల తన చెంతకే మనస్సు పరుగులెడుతు ఉంది ||అమ్మదేవుడో...||