పల్లవి
[అతడు] అమితాబచ్చన్ హైట్ మీదొట్టు, అజారుద్దీన్ బ్యాట్ మీదొట్టు. . .||2||
కనుమూరిబాపిరాజు మీసం మీదొట్టు కెరాఘవేంద్రరావు గడ్డాం మీదొట్టు
అబద్దం చెప్పమన్న చెప్పనూ, నిజం చెప్పొదన్నా అసలే విననూ
హరిశ్చంద్రుడు మా బాబాయిలే, ధర్మరాజు మా బడాబాయిలే ||అమి||
చరణం 1
అరె చిరంజీవి మా ఇంటి చుట్టు తిరుగుతుంటాడు, ఎక్సింగు
నేర్పమంటాడు, చంద్రబాబు నీ వెంట పడుతూ వేదిస్తుంటాడు
ఆంధ్రానేలమంటాడు, బిల్గేట్ సమ్ సలహాలిమ్మని టెలిఫోన్
చేస్తాడు. మిలియన్స్ యిస్తానంటాడు, బ్యాటింగ్‌లోని మెలుకువ
కోసం జయసూర్య వస్తాడు, జలగై పీడిస్తుంటాడు
[ఆమె] పాపం వాళ్లకంతా యింతహెల్ప్ చేస్తే పోలే
నాకా టైములేదు. వాళ్లకు టైమ్ బాగులేదు ||అమి||
యండమూరి కొత్తనవల రాస్తానన్నాడు అయిడియాలివ్వమంటాడు
స్పీల్బర్గ్ కొత్త మూవీ యిస్తానంటాడు, గ్రాఫిక్స్ చెయ్యమంటాడు
సమరం వచ్చి సమస్యలెన్నో నాతో చెపుతాడు సలహాలిమ్మంటుంటాడు
టాటావచ్చి నాతోటి సిసం తింటానన్నాడు ప్రాణం తింటూవుంటాడు
పాపం వాళ్ల అందరికి అపాయింట్మెంట్ యిస్తేపోలే
నాకా టైమ్‌లేదు. . .2 వాళ్లకు టైం బాగోలేదు