పల్లవి
[అతడు] ప్రేమిస్తున్నా...4 నిను చూపినందుకు బ్రతుకుని
నువు పలికినందుకు తెలుగుని, నువు నడిచినందుకు నేలని
నువు పీల్చినందుకు గాలినీ ||ప్రే||
చరణం 1
సొంతం నీకే అయినందుకు అందాన్ని ప్రేమిస్తున్నా
శాంతం నీకే వచ్చినందుకు వయసును ప్రేమిస్తున్నా
అపురూపంగా మలచినందుకు ఆ బ్రహ్మను ప్రేమిస్తున్నా
సుకుమారంగా పెంచినందుకు కన్నోళ్ళకు ప్రేమిస్తున్నా
నిన్ను నిదురపుచ్చినందుకు పాన్పును ప్రేమిస్తున్నా
నిన్ను మేల్కోనిపినందుకు తూర్పును ప్రేమిస్తున్నా
చరణం 2
ఎదురుగ నిన్నే నిలిపినందుకు పగటిని ప్రేమిస్తున్నా
కలలో నిన్నే పంపినందుకు రాత్రిని ప్రేమిస్తున్నా
నీ కన్నులనే పోలినందుకు మీనాన్నను ప్రేమిస్తున్నా
నీ కంఠాన్ని కలిగినందుకు కోయిలను ప్రేమిస్తున్నా
నిన్ను తెలుసుకున్నందుకు నన్నే ప్రేమిస్తున్నా. . .2
నిన్ను నన్ను కలిపినందుకు ప్రేమను ప్రేమిస్తున్నా ||ప్రే||